కన్నబిడ్డలను హతమార్చిన తల్లి
close

తాజా వార్తలు

Updated : 18/05/2021 05:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కన్నబిడ్డలను హతమార్చిన తల్లి

తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైనం

పొదిలి గ్రామీణం(ప్రకాశం): మనస్తాపంతో కన్నబిడ్డలను గొంతు కోసి ఆపై తానూ ఆత్మహత్యకు ప్రయత్నించిన దారుణ ఘటన ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉప్పలపాడులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరి రంగయ్య, రమణమ్మల కుమార్తె ఆదిలక్ష్మి(25)ని సింగరాయకొండకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు సంతానం. అయితే, భార్యాభర్తల మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో 20రోజుల క్రితం ఆదిలక్ష్మి తన పుట్టిల్లు ఉప్పలపాడుకు వచ్చింది. సోమవారం మధ్యాహ్నం భర్తతో ఫోన్‌లో మాట్లాడగా అతడు దుర్భాషలాడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆదిలక్ష్మి తన ఇద్దరు పిల్లల గొంతు కోసి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు ముగ్గురినీ చీమకుర్తి వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో చిన్నారులిద్దరూ (మూడేళ్లు, ఒక సంవత్సరం) ప్రాణాలు విడిచారు. ఆదిలక్ష్మిని చీమకుర్తి వైద్యశాలలో చేర్చుకోకపోవడంతో ఒంగోలు తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని