Drugs Case: క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్‌

తాజా వార్తలు

Published : 26/10/2021 19:32 IST

Drugs Case: క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్‌

ముంబయి: బాలీవుడ్‌ని కుదిపేస్తున్న ముంబయి క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో అరెస్టయినవారిలో ఇద్దరు నిందితులకు బెయిల్‌ మంజూరైంది. ముంబయిలోని మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల (ఎన్‌డీపీఎస్‌) కేసుల విచారణకు ఉద్దేశించిన ప్రత్యేక న్యాయస్థానం మనీశ్‌ రాజ్‌గారియా, అవిన్‌ సాహూలకు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ కూడా ఇదే కేసులో నిందితుడిగా అరెస్టు కావడంతో ఈ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 2న తాము దాడి చేసిన క్రూజ్‌ నౌకలో వీరిద్దరూ అతిథులుగా ఉన్నట్టు నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) కోర్టుకు తెలిపింది. ఈ కేసులో తొలిసారి బెయిల్‌ పొందిన నిందితులు వీరిద్దరే కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ కేసులో ఆర్యన్‌తో పాటు 20 మందిని ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల ఆర్యన్‌కు ఈ న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించడంతో ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు సుదీర్ఘ వాదనలు విన్న బాంబే హైకోర్టు.. బుధవారం కూడా వాదనలు విననున్నట్టు తెలిపింది. రేపు మధ్యాహ్నం 2.30గంటలకు ఆర్యన్‌ సహా అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ ధమేచా బెయిల్‌ పిటిషన్లపై వాదనలు కొనసాగనున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని