TS News: సినీఫక్కీలో నవ వధువు కిడ్నాప్!
close

తాజా వార్తలు

Published : 24/06/2021 00:52 IST

TS News: సినీఫక్కీలో నవ వధువు కిడ్నాప్!

సుల్తానాబాద్‌: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో సినీఫక్కీలో నవ వధువు కిడ్నాప్ జరిగింది. కరుణాకర్ అనే యువకుడికి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయాన్ని వారు పెద్దలకు తెలియజేయగా పెళ్లికి నిరాకరించారు. చేసేదేమీలేక  సదరు ప్రేమజంట ఈనెల 15న ప్రేమవివాహం చేసుకొని సుల్తానాబాద్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువురి కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి, కొత్త జంటను సుల్తానాబాద్‌లోని కరుణాకర్‌ ఇంటికి పంపించారు. ఈ క్రమంలో మంగళవారం కొంతమంది వచ్చి తనను చితకబాది, భార్యను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు కరుణాకర్ పోలీసులకు వెల్లడించాడు. తన భార్యను అపహరించి తీసుకెళ్లిన దుండగులను శిక్షించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.
 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని