ఘోర రోడ్డు ప్రమాదం..9 మంది మృతి

తాజా వార్తలు

Published : 13/11/2020 09:23 IST

ఘోర రోడ్డు ప్రమాదం..9 మంది మృతి

కాఠ్‌మండూ: నేపాల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారు. మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. దార్చులా జిల్లా గన్నా నుంచి మహేంద్రనగర్‌కు వెళ్తున్న ఓ బస్సు గురువారం రాత్రి ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా కొట్టింది. అతివేగంతో ఉన్న వాహనాన్ని భారీ మలుపు వద్ద డ్రైవర్‌ అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనాకు వచ్చారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని