
తాజా వార్తలు
భార్యను హతమార్చి.. వృద్ధుడి ఆత్మహత్య
తల్లాడ: ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగంబజారులో దారుణం చోటు చేసుకుంది. సుబ్రహ్మణ్యం అనే 75 ఏళ్ల వృద్ధుడు అతని భార్య విజయలక్ష్మిని గొడ్డలితో నరికి హతమార్చాడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. ఒకరు అమెరికాలో, మరొకరు కరీంనగర్ జిల్లాలో ఉంటున్నారు. తెల్లవారే సరికి ఇంట్లో మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. హత్య, ఆ తర్వాత ఆత్మహత్య ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి
Tags :