వృద్ధ దంపతుల ఆత్మహత్య
close

తాజా వార్తలు

Updated : 10/04/2021 12:14 IST

వృద్ధ దంపతుల ఆత్మహత్య

దమ్మపేట : భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలోని పట్వారీ గూడెంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ద దంపతులు అర్ధరాత్రి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడటం గ్రామంలో కలకలం సృష్టించింది. ఎస్సై వరుణ్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దూపకుంట్ల భూషణం(75), ఆదిలక్ష్మీ(70) దంపతులు కుమారులతో కాకుండా వేరుగా నివాసం ఉంటున్నారు. అయితే, వారు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నా కుమారులు పట్టించుకోపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారు ఆత్మహత్యకు పాల్పడుతున్న సమయంలో శబ్దం రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి చూడగా..అప్పటికే వారు మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని