close

తాజా వార్తలు

Published : 22/01/2021 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కంచికచర్లలో భారీగా బంగారం పట్టివేత

కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్లలో భారీగా బంగారం పట్టుబడింది. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వినాయకుడి ఆలయం వద్ద గురువారం అర్ధరాత్రి వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు ద్విచక్ర వాహనంపై ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న కిలో బంగారాన్ని పట్టుకున్నారు. నందిగామ గ్రామీణ సీఐ సతీశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా గంపలగూడెంకు చెందిన షేక్‌ రెహమాన్‌, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన మైలవరపు రాజేశ్‌లు ద్విచక్ర వాహనంపై బంగారాన్ని తీసుకెళ్తు్న్నారు. ఈ క్రమంలో తనిఖీలు చేస్తున్న పోలీసులు బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బంగారంతోపాటు రూ.81వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. వీరు ఈ బంగారాన్ని కంచికచర్ల, నందిగామ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. 

ఇవీ చదవండి..
శివమొగ్గలో భారీ పేలుడు.. 8 మంది మృతి

రూ.50 అప్పు... ప్రాణం తీసిందిTags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని