ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

తాజా వార్తలు

Published : 15/08/2020 01:26 IST

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

వివరాలు వెల్లడించిన సీపీ అంజనీకుమార్‌

హైదరాబాద్‌: చైనా ఆన్‌లైన్‌ గేమింగ్‌ ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను సిటీ కమిషనర్‌ అంజనీ కూమార్‌ మీడియాకు వెల్లడించారు. విదేశీయుడు సహా మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 16.9 బిలియన్‌ డాలర్ల మేర ఆన్‌లైన్‌ గేమింగ్‌ జరుగుతోందని సీపీ చెప్పారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ కోసం టెలిగ్రామ్‌, వాట్సాప్‌ గ్రూప్‌ ఉందని, రిఫెరెన్స్‌ల ద్వారా గ్రూపుల్లో చేర్చుకుంటారని తెలిపారు. ప్రతి రోజు వెబ్‌సైట్‌, గ్రూప్‌లు మారుస్తూనే ఉంటారని చెప్పారు. గేమింగ్‌కు సంబందించి మూడు కంపెనీల డైరెక్టర్లు భారత్‌, చైనాలో ఉన్నట్లు గుర్తించామని సీపీ పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌లో ఇప్పటి వరకు రూ.1,100కోట్లు వినియోగించినట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.30 కోట్ల మేర బ్యాంక్‌ ఖాతాలు సీజ్‌ చేశామని వెల్లడించారు.

‘‘ఈ కేసు సంబంధించి ఐటీ శాఖకు సమాచారం ఇచ్చాం. దర్యాప్తు కొనసాగుతోంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ తెలంగాణలో రద్దైంది. వీటి వల్ల చాలా మంది మోసపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి’’అని సీపీ అంజనీ కుమార్‌ అన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని