18లోపు మసూద్‌ను అరెస్ట్‌ చేయాలి: పాక్‌ కోర్టు

తాజా వార్తలు

Published : 10/01/2021 01:36 IST

18లోపు మసూద్‌ను అరెస్ట్‌ చేయాలి: పాక్‌ కోర్టు

లాహోర్‌: నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ అరెస్టుపై పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం(ఏటీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ కేసు విచారణలో భాగంగా మసూద్‌ అజర్‌ను జనవరి 18లోపు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉగ్రవాద నిరోధక విభాగం(సీటీడీ) పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు కోర్టు అధికారులు శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. 

గుజ్రన్‌వాలా ఉగ్రవ్యతిరేక కోర్టు(ఏటీసీ) న్యాయమూర్తి నటషా నసీమ్‌ నేతృత్వంలో మసూద్‌ అజర్‌ అరెస్టు విషయమై శుక్రవారం విచారణ జరిగింది. జనవరి 18లోపు మసూద్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని సీటీడీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించినట్లు కోర్టు అధికారులు తెలిపారు. కాగా టెర్రర్‌ ఫైనాన్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలతో జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌కు వ్యతిరేకంగా ఏటీసీ కోర్టు గురువారం అరెస్టు వారెంటు జారీ చేసిన విషయం తెలిసిందే. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని