పర్యావరణ దినోత్సవం నాడు గంజాయి మొక్కలు నాటారు
close

తాజా వార్తలు

Updated : 09/06/2021 01:38 IST

పర్యావరణ దినోత్సవం నాడు గంజాయి మొక్కలు నాటారు

నాటిన యువకుడి కోసం గాలిస్తున్న పోలీసులు

కొల్లాం: ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు సాధారణంగా మొక్కలు నాటుతుంటారు. కానీ గంజాయి మొక్కలు నాటిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. కొల్లాం జిల్లాలోని కందిచీరా ప్రాంతంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. అయితే వాటిలో కొన్ని గంజాయి మొక్కలు కూడా ఉన్నాయి. స్థానికులు మొక్కలతో ఫొటోలు దిగుతున్న సమయంలో వీటిని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే గంజాయి సాగుపై కేసు నమోదైన ఓ యువకుడు వీటిని నాటినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని