Bangladesh: 70 పెద్దపులుల్ని చంపిన వేటగాడు అరెస్ట్‌

తాజా వార్తలు

Published : 02/06/2021 01:09 IST

Bangladesh: 70 పెద్దపులుల్ని చంపిన వేటగాడు అరెస్ట్‌

ఢాకా: అటవీ ప్రాంతానికి సమీపంలో నివసిస్తూ.. దాదాపు 70 బెంగాల్‌ పులుల్ని చంపిన వేటగాడు హబీబ్‌ తాలుక్దార్‌ను బంగ్లాదేశ్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. పశ్చిమ్‌ బెంగాల్‌, బంగ్లాదేశ్‌లో విస్తరించి ఉన్న సుందర్బన్‌ అడవుల్లోనే బెంగాల్‌ పులులు ఎక్కువగా ఉన్నాయి. అయితే బంగ్లాదేశ్‌లోని సుందర్బన్‌ అటవీ ప్రాంతాలకు సమీపంలో హబీబ్‌ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అడవుల్లో తేనెని సేకరించే వ్యక్తిగా జీవితం కొనసాగిస్తూనే.. పులుల్ని వేటాడి చంపడం మొదలుపెట్టాడు. పులుల చర్మం, ఎముకలు ఇతర అవయవాలను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే హబీబ్‌ పులులను చంపడమే వృత్తిగా మార్చుకున్నాడు. దీంతో అతడిని ‘టైగర్‌ హబీబ్‌’ అని పిలిచేవారు. హబీబ్‌ ఆచూకీ తెలుసుకొని పోలీసులు వచ్చేలోపే అతడు అడవుల్లోకి పారిపోయేవాడు. అలా గత 20సంవత్సరాల్లో 70 పెద్ద పులుల్ని చంపి.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరిగాడు. తాజాగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘హబీబ్‌ మాకొక తొలనొప్పిగా మారాడు. అడవిలోని జీవవైవిధ్యానికి విఘాతం కలిగించేలా అతడి చర్యలు ఉండేవి. ఎట్టకేలకు అతడిని అరెస్టు చేసి జైలుకు పంపించాం’’ అని పోలీసులు వెల్లడించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని