srisailam: డ్రోన్‌ సంచారంపై ముమ్మర విచారణ

తాజా వార్తలు

Published : 06/07/2021 01:02 IST

srisailam: డ్రోన్‌ సంచారంపై ముమ్మర విచారణ

శ్రీశైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో డ్రోన్‌ సంచారంపై విచారణ ముమ్మరం చేసినట్లు కర్నూలు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మాత్రమే డ్రోన్‌ తిరిగినట్లు ఎస్పీ పేర్కొన్నారు. డ్రోన్‌ ఎగిరిన ఘటనలో నలుగురిని పిలిపించి ప్రశ్నించినట్లు తెలిపారు. శ్రీశైలం పోలీసు స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తులపై ఐపీసీ 287, 263 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ ఫకీరప్ప పేర్కొన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ఏం జరిగిందంటే..

శ్రీశైలంలో మూడు రోజులుగా రాత్రి వేళ డ్రోన్‌ చక్కర్లు కొట్టినట్లు సమాచారం. అయితే శనివారం రాత్రి క్షేత్రంలోని పురువీధుల్లో డ్రోన్‌ చక్కర్లు కొడుతుండగా స్థానికులు గుర్తించి దేవస్థానం భద్రతా సిబ్బందికి తెలియజేశారు. వారు దాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు చేశారు. అటవీశాఖ సిబ్బంది నైట్‌ విజన్‌ కెమెరాలతో వీక్షంచారు. అయితే దాన్ని ఆపరేట్‌ చేసిందెవరో గుర్తించలేకపోయారు. దీనిపై దేవస్థానం ఈవో కేఎస్‌ రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని