Ts News: నకిలీ పత్రాలతో భారీ మోసం
close

తాజా వార్తలు

Updated : 18/06/2021 18:52 IST

Ts News: నకిలీ పత్రాలతో భారీ మోసం

ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు
మీడియాకు వివరాలు వెల్లడించిన సీపీ సజ్జనార్‌

హైదరాబాద్: నకిలీ పత్రాలతో స్థిరాస్తి మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. యజమానులకు తెలియకుండా నకిలీ దస్త్రాలు సృష్టించి ఇతరులకు భూమి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని సీపీ తెలిపారు. ఈ కేసుకు  సంబంధించిన వివరాలను సజ్జనార్‌ మీడియాకు వివరించారు.

సీపీ మాట్లాడుతూ.. ‘‘నకిలీ పత్రాలు సృష్టించి యజమానులకు తెలియకుండా మహేశ్వరం పరిధిలోని 40 ఎకరాల భూమి విక్రయానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కేసులో హైదరాబాద్‌ బాచుపల్లికి చెందిన స్థిరాస్తి వ్యాపారి ఆదినారాయణమూర్తి ప్రధాన నిందితుడు. బాధితుడి నుంచి రూ.8.50 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయాలని బాధితుడు ఆదినారాయణమూర్తిపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు బాధితుడి మొబైల్‌కి నకిలీ పత్రాలు పంపించారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఒరిజినల్‌ డాక్యుమెంట్లు కావాలని బాధితుడు మరింత ఒత్తిడి తీసుకొచ్చినా నిందితులు స్పందించలేదు. దీంతో విసుగుచెందిన బాధితుడు రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి పరిశీలించగా.. తనకు నకిలీ దస్త్రాలను పంపించి మోసం చేసినట్లు నిర్ధారణకు వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.

ప్రధాన నిందితుడు ఆదినారాయణ మూర్తితో పాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశాం. ఆదినారాయణ మూర్తికి తొమ్మిది రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఎక్కడ ఖాళీ భూమి కనిపిస్తే అక్కడ ఆ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించాం. ఈ కేసులో 40 ఎకరాలకు సంబంధించి రూ. 1.40 కోట్లకు ఎకరం చొప్పున ఒప్పందం చేసుకుని అగ్రిమెంట్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో భాగంగా 264 నకిలీ పత్రాలు, మహబూబ్‌నగర్ ఎంఆర్‌వో, ఆర్‌డీవోల పేరుతో 9 రెవెన్యూ స్టాంప్స్, రబ్బర్‌ స్టాంప్స్‌‌, 51 పట్టాదారు పాసు పుస్తకాలు సృస్టించారు. వాటిని స్వాధీనం చేసుకున్నాం’’ అని సజ్జనార్‌ వివరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని