వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి కార్యాలయంలో సోదాలు

తాజా వార్తలు

Published : 16/05/2021 00:30 IST

వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి కార్యాలయంలో సోదాలు

పులివెందుల: కడప జిల్లా మామిళ్లపల్లిలోని ముగ్గురాయి గనుల్లో ఇటీవల జరిగిన పేలుడు ఘటనలో అరెస్టయిన వైఎస్‌ ప్రతాప్‌ రెడ్డి కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. పులివెందులలోని ఆయన కార్యాలయంలో పోరుమామిళ్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందిని విచారించారు. పేలుడు పదార్థాలు ఎలా నిల్వచేస్తారు? ఎక్కడ నుంచి తెస్తారు? ఎవరికి విక్రయిస్తారు? ఇటీవల ఎవరెవరికి విక్రయించారు? తదితర వివరాలపై ఆరా తీశారు. మామిళ్లపల్లి క్వారీలో ఈ నెల 8న జరిగిన పేలుడు ఘటనలో 10మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈ నెల 11న వైఎస్‌ ప్రతాప్‌ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని