ఖాకీలపై కారం కొట్టి ఖైదీల పరారీ

తాజా వార్తలు

Published : 07/04/2021 01:26 IST

ఖాకీలపై కారం కొట్టి ఖైదీల పరారీ

చర్యలకు ఉపక్రమించిన రాజస్థాన్‌ జైళ్ల శాఖ 

జోధ్‌పూర్‌: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ఫలోడి జైలు నుంచి 16 మంది ఖైదీలు సోమవారం రాత్రి తప్పించుకున్నారు. సినీ ఫక్కీలో జైలు సిబ్బంది కళ్లల్లో కారం కొట్టి పరారయ్యారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర జైళ్ల శాఖ చర్యలకు ఉపక్రమించింది. నిర్లక్ష్యం కారణంగా నలుగురు అధికారులతో పాటు ఓ కానిస్టేబుల్‌ను మంగళవారం విధులను నుంచి సస్పెండ్ చేసింది. మరోవైపు ఈ ఘటనను తీవ్రమైన చర్యగా పేర్కొంటూ డిపార్ట్‌మెంట్‌ దీనికి బాధ్యత వహిస్తుందని జైళ్ల శాఖ డీజీ  రాజీవ్‌ దాసోత్‌ తెలిపారు. పరారైన ఖైదీలను పట్టుకునేందుకు స్థానిక పోలీసులు, ఎస్పీతో సంప్రదింపులు జరిపి గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు. ఈ మేరకు జోధ్‌పూర్‌, బికనేర్‌ సరిహద్దులను మూసివేశామన్నారు. కాగా, తప్పించుకున్న ఖైదీలను సుఖ్‌దేవ్‌, జగదీశ్‌, షోకత్‌ అలీ, అశోక్‌, ప్రేమ్‌, అనిల్‌, ప్రదీప్‌, రాజ్‌కుమార్‌, మోహన్‌, శరవన్‌, ముకేశ్‌, శివ ప్రతాప్‌, శంకర్, హనుమన్‌, మహేంద్రగా గుర్తించినట్టు తెలిపారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని