Ap News: యువతిపై అత్యాచారం కేసులో పురోగతి
close

తాజా వార్తలు

Updated : 22/06/2021 13:31 IST

Ap News: యువతిపై అత్యాచారం కేసులో పురోగతి

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలోని కృష్ణా నది పుష్కరఘాట్‌లో యువతిపై అత్యాచారం ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. సీతానగరం ప్రాంతంలో ఉండే పాత నేరస్థులను పోలీసులు విచారిస్తున్నారు. మరికొందరి కదలికలపై నిఘా పెట్టారు. ఘటన జరిగిన రోజు వారంతా ఎక్కడున్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు. విచారణ జరిపే క్రమంలో ఇద్దరు అనుమానితులు పోలీసులకు చిక్కినట్లు సమాచారం. సీతానగరానికి చెందిన వీరిపై గతంలో పుష్కర ఘాట్లలో ఒంటరిగా ఉన్న వారిపై దాడులు చేసి దోపిడీలకు పాల్పడిన కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, అత్యాచార ఘటనలో వారి ప్రమేయం ఏ మేరకు ఉందనే అంశంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విచారణలో పోలీసులకు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. బాధితురాలు చెప్పిన ఆనవాళ్లు నిందితులకు దగ్గరగా ఉన్నట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని