బాలుడిని అపహరించి.. ముక్కు, చెవులు కోసి..!

తాజా వార్తలు

Published : 29/12/2020 01:26 IST

బాలుడిని అపహరించి.. ముక్కు, చెవులు కోసి..!

జైపుర్‌: బంధువులే ఆ బాలుడి పాలిట మృత్యుపాశాలయ్యారు. బాలుడిని ఎత్తుకెళ్లి ముక్కు, చెవులు కోసి అత్యంత పాశవికంగా హత్యచేశారు. అనంతరం వ్యవసాయ పొలంలో పడేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో చోటుచేసుకుంది. నవేలి గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు శనివారం నుంచి కనిపించకుండా పోయాడు. అయితే బాలుడిని తమకు తెలిసిన కొందరు వ్యక్తులే ఎత్తుకెళ్లి ఉంటారని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఓ పంట పొలంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. అతడి ముక్కు, చెవులను కోసి హత్య చేశారు. దర్యాప్తులో బాలుడి బంధువులే అపహరించి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. డబ్బు కోసమో లేదా క్షుద్రపూజల కోసమో బంధువులు ఈ హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు స్పందించలేదని, తక్షణ చర్యలు తీసుకొని ఉంటే తమ కుమారుడు బ్రతికుండేవాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి...

భార్యను హత్యచేసి.. సాక్ష్యాలను మార్చేసి..!

రేవ్‌ పార్టీ.. పోలీసుల అదుపులో యువతులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని