Rajasthan: మరదలితో పెళ్లి చేయలేదని.. నలుగురు కుమార్తెలను చంపిన తండ్రి!

తాజా వార్తలు

Published : 19/09/2021 01:28 IST

Rajasthan: మరదలితో పెళ్లి చేయలేదని.. నలుగురు కుమార్తెలను చంపిన తండ్రి!

జైపుర్‌: మనస్తాపానికి గురైన ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. నలుగురు కుమార్తెలను నీటి ట్యాంక్‌లో తోసేసి హత్య చేశాడు. అనంతరం అతడు కూడా అందులోకి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. మృతులంతా పదేళ్లలోపు పిల్లలే. ఈ దుర్ఘటన రాజస్థాన్​లోని బాడ్​మేర్​లో జరిగింది. పోశాల గ్రామానికి చెందిన పుర్ఖారామ్‌కు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే కరోనా కారణంగా అతడి భార్య ఐదు నెలల క్రితం మృతిచెందారు. కుమార్తెలకు తల్లి అవసరం ఉందని భావించిన పుర్ఖారామ్‌.. మరదలు (భార్య చెల్లి)ని ఇచ్చి వివాహం చేయాలని అత్తామామలను కోరాడు. అందుకు వారు అంగీకరించలేదు.

మనస్తాపానికి గురైన పుర్ఖారామ్‌.. కుమార్తెలు జియో (9), నోజి (7), హీనా (3), లాసి (ఏడాదిన్నర) చేత విషం తాగించాడు. అనంతరం వారిని తన ఇంటి ముందు 13 అడుగుల లోతున్న నీటి ట్యాంక్​లో తోసేశాడు. తర్వాత పుర్ఖారామ్​ కూడా అందులో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. అతడు వాటర్​ ట్యాంక్​లోకి దూకుతుండగా పొరుగింటివారు గమనించి పోలీసులకు సమాచారం అందించినట్లు పోలీసు అధికారి ఓం ప్రకాశ్‌ వెల్లడించారు. ఓం ప్రకాశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. నలుగురు పిల్లలను నీటిలో తోసేయగా మునిగిపోయి వారు మరణించినట్లు తెలిపారు. మృతదేహాలను సమీపంలోని మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రాణాలతో బయటపడ్డ పుర్ఖారామ్​ను జిల్లా ఆసుపత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని