పుట్ట మధు: కొనసాగుతున్న విచారణ

తాజా వార్తలు

Published : 10/05/2021 01:02 IST

పుట్ట మధు: కొనసాగుతున్న విచారణ

పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. రామగుండం పోలీసులు తమ అదుపులో ఉన్న పెద్దపల్లి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పుట్ట మధును విచారిస్తున్నారు. అయితే  విచారణలో పుట్ట మధు నోరు విప్పలేదని సమాచారం. మరోవైపు పోలీసుల నోటీసులతో పుట్ట మధు సతీమణి శైలజ విచారణకు హాజరయ్యారు. సోమవారం మరోమారు విచారణకు రావాలని ఆమెను పోలీసులు ఆదేశించారు. 12 బ్యాంకు ఖాతాల వివరాలతో రావాలని పోలీసులు ఆమెకు సూచించారు. వామన్‌రావు తండ్రి కిషన్‌రావును సోమవారం మరోసారి రావాలని పోలీసులు కోరారు. 

హత్యకేసులో అసలైన నిందితులను పట్టుకోలేదని వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు గత నెల 16న వరంగల్‌ రేంజ్‌ ఐజీకి ఫిర్యాదు చేశారు. హత్య జరిగిన రోజున రామగిరి పోలీసులు తన కూతురితో ఫిర్యాదు తీసుకుని, తనతో సంతకం పెట్టించుకున్నారని.. ఆ సమయంలో తాను తీవ్రమైన దుఃఖంలో ఉండి ఫిర్యాదులోని పేర్లను సరిగ్గా చూడలేదని ఆయన తెలిపారు. రాజకీయ కక్షతో పుట్ట మధు హత్య చేయించారని ఆరోపించారు. ఆయన కాల్‌డేటాను సేకరించి, సమగ్ర విచారణ జరిపితే చాలామంది వెలుగులోకి వస్తారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పుట్ట మధును తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని