యాదాద్రిలో రేవ్‌ పార్టీ.. 90 మంది అరెస్టు

తాజా వార్తలు

Published : 13/03/2021 01:21 IST

యాదాద్రిలో రేవ్‌ పార్టీ.. 90 మంది అరెస్టు

భువనగిరి: యాదాద్రి జిల్లాలో నిర్వహిస్తున్న ఓ రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. సంస్థాన్‌ నారాయణ్‌పూర్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో రేవ్‌ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుసుకున్న ఎస్‌ఓటీ పోలీసులు 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. 400 గ్రాముల గంజాయి, 3 ఎల్‌ఎస్‌డీ ప్యాకెట్లు, 120 మద్యం సీసాలు, 15 కార్లు, 30 ద్విచక్రవాహనాలు, 3 ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రేవ్‌ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ హెచ్చరించారు. నిందితులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయనున్నట్లు సీపీ వెల్లడించారు.
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని