మందేసి.. మహిళలతో చిందేసి..!

తాజా వార్తలు

Updated : 06/04/2021 11:08 IST

మందేసి.. మహిళలతో చిందేసి..!

హైదరాబాద్‌: పాతబస్తీలోని బండ్లగూడలో జరిగిన అశ్లీల నృత్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓ పార్టీకి చెందిన నాయకుడు ఇచ్చిన విందులో మహిళలు అశ్లీల నృత్యాలు చేశారు. ఫిబ్రవరి 13న  జరిగిన ఈ విందులో సదరు నాయకుడికి చెందిన స్నేహితులు మద్యం సేవించి మహిళలతో చిందులు వేశారు.  సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్‌ కావడంతో చాంద్రాయణగుట్ట  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పర్వేజ్‌ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.
ఘటన జరిగిన సమయంలో వెంటనే దాడి చేస్తే వివరాలు తెలిసేవని, ప్రస్తుతం కేవలం వీడియో మాత్రమే ఉన్నందున దానికి సంబంధించిన వివరాలు సేకరించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. మహిళలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. వాళ్లు ఇక్కడి వాళ్లేనా? లేక ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారా? అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని