స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్య 

తాజా వార్తలు

Updated : 03/02/2021 04:39 IST

స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్య 

సూర్యాపేట జిల్లాలో ఘటన

చివ్వెంల: సూర్యాపేట జిల్లాలో స్థిరాస్తి వ్యాపారి శశిధర్‌రెడ్డి (47) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో తన వ్యవసాయ క్షేత్రానికి డ్రైవర్‌ నరేశ్‌తో కలిసి శశిధర్‌రెడ్డి కారులో బయలుదేరారు. కారు దిగి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలిస్తుండగా.. పది నిమిషాల వ్యవధిలో సుమారు ఆరుగురు దుండగులు ఆటోలో వచ్చి శశిధర్‌రెడ్డిని వేట కొడవళ్లతో వెంటాడి చంపారు. మృతదేహాన్ని సమీపంలోని ఓ మడుగులో తొక్కి అక్కడి నుంచి పరారయ్యారని డ్రైవర్‌ నరేశ్‌ తెలిపారు. 

వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు జాగిలాలతో ఘటన స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ మోహన్‌ కుమార్‌, సీఐ విఠల్ రెడ్డి, ఎస్సై లోకేశ్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. తన భార్య, కొడుకు హత్య కేసులో శశిధర్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉండటమే కాకుండా, మరో హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నారు. ఈ హత్యలతో పాటు స్థిరాస్తి వ్యాపార తగదాలు హత్యకు కారణమై ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. 

ఇవీ చదవండి..

పట్టాభిపై దాడి: సీసీ ఫుటేజీ దృశ్యాలు..

జైలుకు పంపిందనే కక్షతో వివాహితపై దాడి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని