చాదర్‌ఘాట్‌ వద్ద బస్సు-బైక్‌ ఢీ: ఇద్దరి మృతి

తాజా వార్తలు

Published : 11/03/2021 01:36 IST

చాదర్‌ఘాట్‌ వద్ద బస్సు-బైక్‌ ఢీ: ఇద్దరి మృతి

హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన నగరంలోని చాదర్‌ఘాట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఇద్దరు యువకులు ఓ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో అతివేగంగా వెళ్తున్నారు. ఈక్రమంలో ఆర్టీసీ బస్సును ఢీకొని కింద పడ్డారు. తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని