
తాజా వార్తలు
బోర్వెల్ వాహనం, కారు ఢీ: ఏడుగురి మృతి
చెవేళ్ల: హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద బుధవారం ఉదయం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. చేవెళ్ల సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాదులోని తాడ్‌బండ్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని 11 మంది(ఇద్దరు చిన్నారులు సహా) కర్నాటక రాష్ట్రంలోని గుర్మిత్‌కల్‌కు తెల్లవారుజామున బయల్దేరారు.
చేవెళ్ల మండలంలోని కందవాడ స్టేజి దాటిన తర్వాత రోడ్డు మలుపులో వీరు ప్రయాణిస్తున్న కారు.. ముందుగా వెళ్తున్న వాహనాలను ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బోర్వెల్ లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు ఆసిఫ్‌ఖాన్(50), సానియా(18), నజియా బేగం(45), హర్ష(28), నజియా భాను(36), హర్షభాను(6), ఖలీద్ (43)గా గుర్తించారు. కరీనా బేగం, అయూమ్ ఖాన్, నిజార్బేగ్, అన్వర్ ఖాన్ లకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడినవారిని హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, స్వల్పంగా గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రమాద తీవ్రతతో కారు నుజ్జు నుజ్జయింది. ప్రమాద ఘటనతో బీజాపూర్ జాతీయరహదారిపై రెండుకిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
