రోడ్డు ప్రమాదంలో సినీ నిర్మాత మృతి

తాజా వార్తలు

Published : 20/08/2020 01:08 IST

రోడ్డు ప్రమాదంలో సినీ నిర్మాత మృతి

దామచర్ల: నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని అంబులెన్స్‌ ఢీకొన్న ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి చెందారు. అంబులెన్స్‌ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు నెల్లూరు జిల్లాకు చెందిన గుండాల కమలాకర్‌రెడ్డి (40), నందగోపాల్‌రెడ్డి(75)గా గుర్తించారు. నందగోపాల్‌రెడ్డి ‘కనులు కనులను దోచాయంటే’ చిత్ర నిర్మాతల్లో ఒకరు. అనారోగ్యంతో ఉన్న నందగోపాల్‌రెడ్డిని చికిత్స కోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టు మార్టం కోసం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని