close

తాజా వార్తలు

మినీలారీ, బైక్‌ ఢీ: ముగ్గురి మృతి

రామచంద్రాపురం: మినీలారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన తూర్పు గోదావరిజిల్లా రామచంద్రాపురం మండలం హసనబాదలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..కరప మండలం సిరిపురానికి చెందిన రామరాజు, ప్రకాశ్‌రావు, సూర్యనారాయణలు హసనబాదలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం ద్రాక్షారామం వెళ్లి తిరిగి హసనబాదకు పయనమయ్యారు. ఈ క్రమంలో హసనబాద సమీపంలోని మలుపు వద్దకు రాగానే అదుపుతప్పి లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నున్న రామరాజు(35) అక్కడికక్కడే మృతిచెందగా, నున్న ప్రకాశ్‌రావు(54)ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.  నున్న సూర్యనారాయణ(60) పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.