close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120023339 [video_srlno] => 1 [video_type] => 4 [video_link] => 1302KNC_BUS170220.mp4 [video_short_link] => 1302KNC_BUS170220.mp4 [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-18 09:13:32.076061 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

ఆకలి తీర్చి అనంత లోకాలకు

కుమార్తెకు భోజనం  ఇచ్చి వస్తుండగా ప్రమాదం
బైకును ఢీకొట్టిన బస్సు..  తండ్రితోపాటు బంధువు మృతి

కంచికచర్ల, న్యూస్‌టుడే: పాఠశాలలో చదువుతున్న కుమార్తెకు మధ్యాహ్న భోజనం ఇచ్చి బయలుదేరిన ఓ తండ్రి, సోదరితో కబుర్లు చెప్పి వాటిని నెమరేసుకుంటున్న ఓ సోదరుడు ప్రమాదంలో చనిపోయారు. ఈ విషాద ఘటన సోమవారం కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కంచికచర్ల మండలం నక్కలంపేటకు చెందిన హరికృష్ణ (42) భార్య, కుమార్తె భావనతో కలిసి మూడేళ్లుగా మోగులూరులో నివసిస్తున్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుమార్తెను కంచికచర్లలోని ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారు. భావనకు మధ్యాహ్న భోజనం అందించేందుకు హరికృష్ణ బైకుపై బయలుదేరారు. విజయవాడలో సీఏ చదువుతూ చుట్టపుచూపుగా వచ్చిన వదిన కుమారుడు పెద్ది రామ్‌గోపాల్‌ (24) కూడా ఆయనతోపాటు వెళ్లారు. కంచికచర్ల వెళ్లి భావన భోజనం తిన్నంతసేపూ ఇద్దరూ కబుర్లు చెప్పారు. అనంతరం బంధువులను కలిసేందుకు నక్కలంపేట బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లగానే ఎదురుగా వస్తున్న అమ్రితసాయి కళాశాల బస్సు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. వెనుక కూర్చున్న హరికృష్ణ కందకంలో, ద్విచక్ర వాహనం నడుపుతున్న రామ్‌గోపాల్‌ రోడ్డుపై పడి పోయారు. ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ద్విచక్ర వాహనం బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోయింది. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు భోజనం ఇచ్చిన నాన్న ఇంటికి వచ్చేసరికి ఇక లేరనే విషయం తెలుసుకున్న బాలిక ఏడుపు ఆపడం ఎవరితరం కాలేదు. తండ్రి లేని తన కుమారుడు రామ్‌గోపాల్‌ను సీఏ చదివించి ఉన్నత ఉద్యోగంలో చూడాలనుకున్నానని, ఇంతలోనే తనను ఒంటరిని చేసి వెళ్లిపోయాడంటూ కుమారుడి మృతదేహంపై పడి అతని తల్లి చేసిన రోదన పలువురిని కంటతడి పెట్టించింది. ప్రమాద సమయంలో కళాశాల బస్సులో 30 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. బస్సు మరికొంత దూరం వెళ్లి ఉంటే విద్యుత్తు స్తంభాలను ఢీకొట్టడం లేదా కందకంలో పడి భారీ ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.