close

తాజా వార్తలు

Updated : 02/03/2021 13:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఓ చేత్తో బీరుసీసా..మరో చేత్తో స్టీరింగ్‌

నలుగురి ప్రాణాలు బలిగొన్న మద్యం మత్తు

పెనుగొండ: అనంతపురం జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మద్యం మత్తు నలుగురి ప్రాణాలను బలిగొంది. పెనుగొండ మండలం ఎర్రమంచి సమీపంలోని కియాకార్ల పరిశ్రమ ప్రధాన గేటు వద్ద ఈదుర్ఘటన జరిగింది. ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని కారు ఢీకొని నలుగురు మృతి చెందారు. ప్రమాదానికి గురైన కారు బెంగళూరు వైపు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

జాతీయ రహదారిపై ఉన్న స్పీడ్‌ బ్రేకర్ వద్ద ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం నెమ్మదించడంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో దిల్లీకి చెందిన ఓ యువతి, బెంగళూరుకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతదేహాల వద్ద లభించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు ఆధారంగా.. రేఖ(21)నార్త్ దిల్లీ, ఆంచల్ సింగ్(21), మహబూబ్ ఆలం (31), బెంగళూరు, మనోజ్ మిట్టల్ (38) నార్త్ బెంగళూరు వాసిగా గుర్తించారు. మృతదేహాలను పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారులోని వాహనచోదకుడి చేతిలో బీరు సీసాను పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు జేసీబీ సాయంతో ప్రమాదానికి గురైన కారును పక్కకు తీసి ట్రాఫిక్‌ పునరుద్ధరించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పెనుగొండ సీఐ తెలిపారు. 


 



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని