AP News: గుర్తు తెలియని వాహనం ఢీ: ముగ్గురు మృతి

తాజా వార్తలు

Published : 30/05/2021 01:33 IST

AP News: గుర్తు తెలియని వాహనం ఢీ: ముగ్గురు మృతి

మదనపల్లి: చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక బిస్కెట్‌ ఫ్యాక్టరీ వద్ద శనివారం రాత్రి ఓ గుర్తు తెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి సహా తల్లిదండ్రులు మృతి చెందారు. మృతులు మదనపల్లెకు చెందిన నరేష్‌(32), ఉమాదేవి(27), నిషిత(2)గా గుర్తించారు. దంపతులు కర్ణాటకలోని కుర్గేపల్లెకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని