రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
close

తాజా వార్తలు

Updated : 24/04/2021 08:02 IST

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొనడంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మృతులను ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, నాగరాజు, అలివేలుగా గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని