ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు: ముగ్గురి మృతి
close

తాజా వార్తలు

Updated : 10/05/2021 05:50 IST

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు: ముగ్గురి మృతి

గుంటూరు: ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో తీవ్రగాయలై  ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడు వద్ద జరిగింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారు. మృతులను ఫిరంగిపురం మండలం తాళ్లూరుకు చెందిన షేక్‌ చినమస్తాన్‌, ఆయన భార్య నూర్జహాన్‌, కుమారుడు హుస్సేన్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని