AP News: లారీ బోల్తా.. ముగ్గురి మృతి

తాజా వార్తలు

Updated : 07/07/2021 12:46 IST

AP News: లారీ బోల్తా.. ముగ్గురి మృతి

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి- సావరగూడెం కూడలి వద్ద లారీ బోల్తా పడింది. చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. లారీ పై భాగంలో కూర్చున్న భార్యాభర్తలు, చిన్నారి దుర్మరణం చెందారు. బిహార్‌ నుంచి బెంగళూరుకు బియ్యం లోడ్‌తో లారీ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. లారీ కింద ఉన్న మృతదేహాలను తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతులను ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని