Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 13 మంది దుర్మరణం

తాజా వార్తలు

Updated : 20/08/2021 18:32 IST

Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 13 మంది దుర్మరణం

ముంబయి: మహారాష్ట్రలోని బుల్ఢాణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికులను తరలిస్తున్న వాహనం బోల్తాపడిన ఘటనలో 13 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. సింధ్‌ఖేడ్‌రాజా- మేహ్‌కర్‌ రోడ్డుపై దుసర్‌బిడ్‌ గ్రామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ‘మొత్తం 16 మంది కూలీలు ‘నాగ్‌పూర్‌- ముంబయి సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్టు’ పనులకు బయల్దేరారు. వాహనం వేగంగా ఉండటం, రోడ్డుపై పెద్ద గుంత కారణంగా బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయ’ని బుల్ఢాణా ఎస్పీ అర్వింద్‌ ఛావ్రియా ఓ వార్తసంస్థకు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే కిన్‌గావ్‌ రాజా పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్లో కొందరిని జాల్నా జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరికొందరు సింధ్‌ఖేడ్‌రాజా దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. కూలీల్లో చాలావరకు బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారే ఉన్నారని పోలీసులు తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని