కల్వర్టును ఢీకొన్న కారు.. నలుగురు మృతి

తాజా వార్తలు

Published : 10/03/2021 01:33 IST

కల్వర్టును ఢీకొన్న కారు.. నలుగురు మృతి

త్రిపురాంతకం: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరులోని తంబాళగరువు ప్రాంతానికి చెందిన మధుకర్(58), పెద్ది సురేష్(63), తాల్లూరి సురేష్‌(50), కొండు పాండురంగారావు(56), కృష్ణ(55) స్నేహితులు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఐదుగురు స్నేహితులు కలిసి స్వామివారిని దర్శించుకునేందుకు కారులో వెళ్లారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు.

ఈ క్రమంలో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని శ్రీనివాస్‌నగర్ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. కృష్ణ అనే మరో వ్యక్తికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం యర్రగొండపాలెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యర్రగొండపాలెం సీఐ పి.దేవప్రభాకర్, ఎస్ఐ వెంకట కృష్ణయ్య తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని