TS News: రెండు కార్లు ఢీకొని న‌లుగురి మృతి
close

తాజా వార్తలు

Updated : 19/06/2021 11:04 IST

TS News: రెండు కార్లు ఢీకొని న‌లుగురి మృతి

కొడంగ‌ల్‌: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్ర‌మాదం చోటు చేసుకుంది. కొడంగ‌ల్ శివారులోని ఎల్ల‌మ్మ ఆల‌యం వ‌ద్ద ఎదురెదురుగా వ‌చ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు దుర్మ‌ర‌ణం చెందారు. హైద‌రాబాద్ నుంచి క‌ర్ణాట‌క వైపు వెళుతున్న వాహ‌నం ఎదురుగా వ‌చ్చిన మ‌రో కారును ఢీకొంది. స్థానికులు స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను వాహ‌నాల నుంచి బ‌య‌టికి తీశారు. మృతుల‌ను అబ్దుల్‌, ర‌షీద్‌, అమీర్, మౌలానా బేగంగా గుర్తించారు. ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని