
తాజా వార్తలు
చెట్టును ఢీకొన్న ట్రాలీ ఆటో: ముగ్గురి మృతి
వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృతిచెందారు. 20 మందికిపైగా గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధిత కూలీలను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాసులుగా గుర్తించారు.
ఇవీ చదవండి
Tags :