close

తాజా వార్తలు

Updated : 28/11/2020 08:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తల్లికి కష్టం తీర్చేందుకు అత్తారింట్లో కోడలి చోరీ 

హైదరాబాద్‌: తల్లి కష్టాలు తీర్చేందుకు అత్తారింట్లో కోడలు దొంగతనం చేసిన ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. జవహర్ నగర్ యాప్రాల్ కింది బస్తీలో... ఈ నెల 23న చోరీ జరిగింది. ఇంటి యజమాని ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అది ఇంటిదొంగల పనేనని తేల్చారు. అప్పులపాలైన తల్లికి సాయం చేసేందుకు అత్త ఇంట్లో కోడలే చోరీ చేసిందని నిర్ధరించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కోడలే బంగారం అపహరించినట్టు తెలిపారు. తల్లి లీలావతి, కుమార్తె సోనీని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 44 తులాల బంగారం, 15 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ.. ‘‘సీసీ కెమెరాలను పరిశీలించాం. అందులో ఓ వ్యక్తి పూర్తి శరీరాన్ని కవర్ చేసే విధంగా దుస్తులు ధరించి ఉన్నట్లు గుర్తించాం. అప్పుడు విషయం అర్థమైంది. ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఓ కుమారుడు ఉన్నాడు. అతడు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతడి భార్యతోనూ, ఆమె తల్లితోనూ ఆ కుటుంబానికి కొన్ని వివాదాలు ఉన్నాయి. దాంతో వారిపై కొంత అనుమానం వచ్చింది. సీసీటీవీ పుటేజీని డెవలప్‌ చేసి మరికొన్ని కెమెరాలను కూడా పరిశీలించాం. దొంగతనం చేసింది పురుషుడు కాదు మహిళేనని నిర్ధారణకు వచ్చాం. వారిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేశాం. అప్పుడు అసలు విషయం గుర్తించాం’’ అని వివరించారు. 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన