తమిళనాడులో రూ.1000 కోట్ల కొకైన్‌ పట్టివేత
close

తాజా వార్తలు

Published : 22/04/2021 01:34 IST

తమిళనాడులో రూ.1000 కోట్ల కొకైన్‌ పట్టివేత

తూత్తుకుడి: తమిళనాడులోని తూత్తుకుడిలో రూ.1000 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నుంచి వీవోసీ పోర్టుకు వచ్చిన ఓ నౌకలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో నౌకలోని టింబర్ కిందిభాగంలో భారీ మొత్తంలో కొకైన్‌ను గుర్తించారు. బ్యాగుల్లో ఉన్న మొత్తం 400 కేజీల కొకైన్‌ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వీటి మొత్తం విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.1000 కోట్ల వరకూ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మాదకద్రవ్యాలు ఎక్కడినుంచి వచ్చాయి? ఎక్కడకు తరలిస్తున్నారన్న...తదితర అంశాలపై దర్యాప్తు ప్రారంభించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని