తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం
close

తాజా వార్తలు

Updated : 25/04/2021 15:44 IST

తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం

ఇద్దరి మృతి

తిరుపతి: తిరుపతి కర్నాల వీధిలో ఆర్టీసీకి చెందిన సప్తగిరి బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి తిరుమల వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

బస్సు బీభత్సానికి రెండు విద్యుత్‌ స్తంభాలు నేలకు ఒరిగిపోగా.. నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. మూడో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో బస్సు ఆగింది. డ్రైవర్‌ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని