బోయిన్‌పల్లి కేసు: 17 బెయిల్‌ పిటిషన్లు తిరస్కరణ
close

తాజా వార్తలు

Published : 01/02/2021 21:00 IST

బోయిన్‌పల్లి కేసు: 17 బెయిల్‌ పిటిషన్లు తిరస్కరణ

హైదరాబాద్‌: ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో నిందితులుగా ఉన్న 17మంది బెయిల్ పిటిషన్లను సికింద్రాబాద్ న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో 17మంది నిందితులను బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. రిమాండ్ ఖైదీలుగా ఉన్న 17మంది సికింద్రాబాద్ న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వీరికి బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని.. అవహరణలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఇంకా పరారీలోనే ఉన్నారని పోలీసులు కౌంటర్‌లో పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం వారందరి బెయిల్‌ పిటిషన్లను తిరస్కరించింది. అపహరణ కేసులో ఏ3గా ఉన్న భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం ఇప్పటికే తిరస్కరించింది.

ఇవీ చదవండి..

తెదేపా సర్పంచి అభ్యర్థి భర్త అనుమానాస్పద మృతి

నా పరిధి,బాధ్యత తెలుసు: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని