‘నాతో గడిపితేనే మీ ఉద్యోగాలుంటాయ్‌..’
close

తాజా వార్తలు

Published : 07/02/2021 00:47 IST

‘నాతో గడిపితేనే మీ ఉద్యోగాలుంటాయ్‌..’

అడ్మిన్‌ బెదిరిస్తున్నాడంటూ మహిళా ఉద్యోగుల ఫిర్యాదు

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలోని ఎజైల్‌ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌లోని మహిళా ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సంస్థ అడ్మిన్‌ శ్రీకాంత్‌  తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. తనతో గడిపితేనే ఉద్యోగాలు ఉంటాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీకాంత్‌ ఆగడాలను తట్టుకోలేక ఎనిమిది మంది బాధితులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

‘‘నేను ఐదారేళ్లుగా ఇండిగోలోనే ఎజైల్‌లో చేస్తున్నా. శ్రీకాంత్‌ సార్‌ నా దగ్గర రూ.15వేలు తీసుకున్నాడు. డబ్బులు అడిగితే నువ్వు డ్యూటీ ఎలా చేస్తావో చూస్తా.. పోలీస్‌ స్టేషన్‌కి రా అని బెదిరిస్తున్నాడు. ఆయనతో గడపాలట.. లేదంటే డ్యూటీ చేయొద్దట. అందుకే టార్చర్‌ పెట్టి క్లీనింగ్‌లో అక్కడా ఇక్కడా వేస్తున్నాడు’’ అని ఓ మహిళా ఉద్యోగి వాపోయారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని