శంషాబాద్‌ రోడ్డు ప్రమాదం: తాగి కారు నడిపారు

తాజా వార్తలు

Updated : 19/04/2021 15:43 IST

శంషాబాద్‌ రోడ్డు ప్రమాదం: తాగి కారు నడిపారు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. అతివేగంతో ఎదురుగా వచ్చిన ఓ కారు ఇటుక లారీ కిందకు దూసుకెళ్లడంతో అది బోల్తా పడి ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భూదాన్(25) అనే వ్యక్తి మృత్యువాతపడ్డాడు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది.

ఈ ప్రమాదానికి కారణమైన వారిని గిరిప్రసాద్, సంగమేశ్వర్, మల్లేష్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరిలో గిరి ప్రసాద్‌ కానిస్టేబుల్‌ కాగా, సంగమేశ్వర్‌ హోంగార్డ్‌గా పనిచేస్తున్నాడు. ముగ్గురు స్నేహితులు కలిసి యాదగిరి గుట్ట వెళ్లారు. అనంతరం ఓఆర్‌ఆర్‌ మీదుగా శంషాబాద్‌కు వచ్చారు. ఓ వెంచర్‌ వద్ద మద్యం సేవించి, కారు నడుపుకొంటూ వచ్చి ఎదురుగా కూలీలతో వస్తున్న లారీని ఢీకొట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వీరిలో హోంగార్డ్‌ సంగమేశ్వర్‌ మద్యం సేవించినట్లు తేల్చారు. గిరిప్రసాద్‌ రక్త నమూనాలను పోలీసులు సేకరించారు. ప్రమాదానికి కారణమైన గిరిప్రసాద్‌ను రిమాండ్‌ చేయడటంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు  పోలీసు ఉన్నతాధికారులు సమాయత్తమవుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని