Visakha HPCL: అదుపులోకి వచ్చిన మంటలు
close

తాజా వార్తలు

Updated : 26/05/2021 16:33 IST

Visakha HPCL: అదుపులోకి వచ్చిన మంటలు

ప్రాణనష్టం లేదన్న కలెక్టర్‌

విశాఖ: హెచ్‌పీసీఎల్‌ ప్రమాద ఘటనలో మంటలు అదుపులోకి వచ్చాయని విశాఖ జిల్లా కలెక్టర్‌ విజయ్‌చంద్‌ వెల్లడించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అరగంటలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారన్నారు. ప్రమాదం గురించి ఎవరికీ ఆందోళన అవసరం లేదని ఆయన అన్నారు. అలారం మోగడంతో అందరం బయటికొచ్చేశామని అందులో పని చేస్తున్న కార్మికులు చెబుతున్నారు. సహాయక చర్యల్లో నావికా, హెచ్‌పీసీఎల్‌, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫైర్‌ సెన్సార్లు పని చేయడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనా స్థలానికి మంత్రి అవంతి శ్రీనివాసరావు చేరుకున్నారు. ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో విశాఖ హెచ్‌పీసీఎల్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి వెంటనే దట్టమైన పొగలు, మంటలు కమ్ముకున్నాయి.  దీంతో సిబ్బంది, కార్మికులతోపాటు స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అత్యవసర సమయంలో మోగించే మూడు సైరన్లను మోగించి సిబ్బంది, కార్మికులను బయటకు పంపించి వేశారు. గతంలో సంభవించిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఏం జరుగుతుందోనని గాజువాక, మల్కాపురం పరిసర ప్రాంతవాసులు భయాందోళనలకు గురయ్యారు. ముడి చమురును శుద్ధి చేసే సీడీయూ మూడో యూనిట్‌లో ప్రమాదం జరిగిందని తెలుసుకొని మరింత భయపడ్డారు. ఇది చాలా సున్నితమైన యూనిట్‌, అత్యంత మండే స్వభావం గల పదార్థాలన్నీ అధిక మొత్తంలో ఇక్కడ ఉంటాయి. మంటల తీవ్రత అంతకంతకూ పెరిగిపోవడంతో భయకంపితులయ్యారు. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి  అత్యాధునిక పరికరాలతో ప్రత్యేక పద్ధతిలో మంటలను అదుపు చేశారు. మొత్తం 20 అగ్నిమాపక యంత్రాలు, హెచ్‌పీసీఎల్‌ అగ్నిమాపక సిబ్బంది తోపాటు నావికా సిబ్బంది, పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని