ఘోరం.. ఆరుగురు చిన్నారుల సజీవ దహనం 
close

తాజా వార్తలు

Updated : 31/03/2021 10:08 IST

ఘోరం.. ఆరుగురు చిన్నారుల సజీవ దహనం 

పట్నా: బిహార్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అరారియా జిల్లా కబైయా గ్రామంలో ఓ పూరింట్లో చెలరేగిన మంటల్లో చిక్కుకొని ఆరుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మొక్క జొన్నలు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ చిన్నారులు బయటకు రాలేకపోయారు. చిన్నారుల హాహాకారాలు విని స్థానికులు అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. చిన్నారుల్ని కాపాడలేకపోయారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా 3 నుంచి ఆరేళ్లు లోపు చిన్నారులే కావడం అందరినీ కలిచివేస్తోంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని