
తాజా వార్తలు
పటాన్చెరులో ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య
పటాన్చెరు అర్బన్: ఆన్లైన్ బెట్టింగ్‌లతో అప్పుల పాలైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పటాన్చెరు ఎస్సై ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరులోని చైతన్యనగర్ కాలనీకి చెందిన రవికుమార్ (28) బెంగళూరు ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నారు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రవి కుమార్ ఆన్లైన్ బెట్టింగ్‌లతో అప్పుల పాలయ్యాడు. తండ్రి ప్రభాకర్ రూ.లక్ష అప్పు తీర్చినా.. మరిన్ని అప్పులు అలాగే ఉండటంతో మనస్తాపానికి గురయ్యాడు. తండ్రి మంగళవారం విధులకు వెళ్లగానే, పడక గదిలోకి వెళ్లి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. దీనిని గమనించిన తల్లి పక్కింటి వారికి తెలుపగా.. వారంతా రవిని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. వైద్యులు పరీక్షించి రవికుమార్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పై తెలిపారు.
ఇవీ చదవండి..
యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది!
కాటేసిన మరో కన్న తండ్రి.. అంతమయ్యాడు