విఘ్నేశ్వరస్వామి ఆలయంలో విగ్రహం ధ్వంసం
close

తాజా వార్తలు

Published : 02/01/2021 00:58 IST

విఘ్నేశ్వరస్వామి ఆలయంలో విగ్రహం ధ్వంసం

రాజమహేంద్రవరం నేరవార్తలు: ఏపీలో ఆలయాలపై వరుస దాడులు స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది రథం దగ్ధం ఘటన మరువక ముందే రాజమహేంద్రవరం శ్రీరాంనగర్‌ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున మరో ఘటన జరిగింది.  విఘ్నేశ్వర ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి ఉన్న రెండు చేతులను గుర్తు తెలియని వ్యక్తులు విరిచేశారు. ఈ ఉదయం ఆలయం తలుపులు తెరిచిన అర్చకులు దీన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీ సంతోష్‌, సీఐ దుర్గా ప్రసాద్ పరిస్థితిని పరిశీలించారు. క్లూస్‌టీమ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులకు కఠినంగా శిక్షపడేలా చూస్తామని తెలిపారు. తెదేపా రాష్ట్ర నాయకుడు గన్ని కృష్ణ ఇంటికి సమీపంలోనే విఘ్నేశ్వరస్వామి ఆలయం ఉంది.   

ఆలయాలపై దాడులు పరిపాటిగా మారింది..
విషయం తెలుసుకున్న తెదేపా నేత, ఆలయ ధర్మకర్త గన్ని కృష్ణ తన అనుచరులతో ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, దేవతామూర్తుల విగ్రహాలపై దాడులు జరగడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇటీవల అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనలో ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం తల విరగొట్టిన ఘటనలో కూడా ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఆలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి.. చౌడేశ్వరీ ఆలయంలో రాచమల్లు ప్రమాణంTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని