వీడియో: మీ చిన్నారులను ఒంటరిగా వదలొద్దు!
close

తాజా వార్తలు

Published : 03/04/2021 01:41 IST

వీడియో: మీ చిన్నారులను ఒంటరిగా వదలొద్దు!

నాగర్‌ కర్నూలు: చిన్నారులను వీధుల్లోకి ఒంటరిగా వదిలిపెట్టే సాహసం చేస్తున్న తల్లిదండ్రులకు ఇదొక హెచ్చరిక. బయటకు వెళ్లిన అభం శుభం తెలియని చిన్నారులు ఊహించని ప్రమాదంలో చిక్కుకోవచ్చు. నాగర్‌కర్నూలు జిల్లాలో జరిగిన ఓ ఘటన తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజెప్పింది. 

తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలో నాలుగేళ్ల చిన్నారి నందిని వీధిలో ఒంటరిగా నడిచి వస్తుండగా వీధి కుక్క దాడి చేసి లాక్కెళ్లింది. ఈ దృశ్యాలు కలచివేస్తున్నాయి. స్థానిక బస్‌డిపో ముందు కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడి చేసిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. కుక్క దాడి చేయడంతో చిన్నారి అరుపులకు స్థానికులు వచ్చి కాపాడారు. వెంటనే చిన్నారిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దాడిలో చిన్నారి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పురపాలక అధికారులు స్పందించి వెంటనే కుక్కలు, పందుల స్వైరవిహారాన్ని అరికట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని