Crime news: యువకుడిని చితకబాది.. విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌

తాజా వార్తలు

Updated : 25/08/2021 20:38 IST

Crime news: యువకుడిని చితకబాది.. విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌

మైసూర్‌: కర్ణాటకలోని మైసూర్‌లో దారుణం చోటుచేసుకుంది. డబ్బులు ఇవ్వలేదని ఓ విద్యార్థినిపై దోపిడీ దొంగలు సామాహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. మైసూరుకు చెందిన యువతీయువకుడు నగర శివారుల్లోని చాముండి హిల్స్‌ వద్ద ఉన్న చాముండేశ్వరి దేవాలయానికి వెళ్లారు. కాగా ఆలయానికి సమీపంలోనే వారిని చుట్టుముట్టిన దోపిడీ దొంగలు డబ్బులు ఇవ్వాలని వారిని డిమాండ్‌ చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో వారిపై దాడికి పాల్పడ్డారు. యువకుడిని తీవ్రంగా కొట్టిన దొంగలు.. అందులోని ఇద్దరు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

కోలుకున్న బాధితులు ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించి పరారీలో ఉన్న దొంగల కోసం గాలిస్తునట్లు తెలిపారు. ఈ దుర్ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువతి వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని.. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆ రాష్ట్ర హోంమంత్రి అరాగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ కేసు దర్యాప్తు కోసం బెంగళూరు నుంచి ప్రత్యేక బృందాన్ని పంపించినట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని