గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం

తాజా వార్తలు

Updated : 28/06/2021 10:38 IST

గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం

పి.గన్నవరం: తూర్పు గోదావరి జిల్లాలోని వశిష్ఠ గోదావరి నదిలో గల్లంతైన నలుగురు విద్యార్థుల్లో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. లంకలగన్నవరానికి చెందిన పదో తరగతి విద్యార్థులు రత్నసాగర్‌, బండారు నవీన్‌, పంతాల పవన్‌, ఖండవిల్లి వినయ్‌ పి.గన్నవరం పరిధిలోని గోదావరిలో నిన్న స్నానానికి వెళ్లారు. మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన వారు సాయంత్రానికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వశిష్ఠ గోదావరి వద్ద గాలించారు. 
ఇసుక తిన్నెల మీద విద్యార్థుల దుస్తులు, చెప్పులు, రెండు సెల్‌ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థుల ఆచూకీ ఎంత సేపటికీ తెలియకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఈ ఉదయం రత్నసాగర్‌, నవీన్‌, పవన్‌ మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. మరొకరి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని