Kerala: ప్రియురాలి గొంతు కోసి.. పోలీసులు వచ్చేదాకా ఎదురుచూసి..

తాజా వార్తలు

Published : 02/10/2021 01:38 IST

Kerala: ప్రియురాలి గొంతు కోసి.. పోలీసులు వచ్చేదాకా ఎదురుచూసి..

కొట్టాయం: కేరళలోని కొట్టాయం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో గర్ల్ ఫ్రెండ్‌తో గొడవపడిన ఓ విద్యార్థి విచక్షణారహితంగా అక్కడే ఆమె గొంతుకోసి చంపేశాడు. ఆ తర్వాత పారిపోకుండా అక్కడే పోలీసులు వచ్చేదాకా ఎదురుచూసి లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కొట్టాయం జిల్లాకు చెందిన 22ఏళ్ల నిధినా మోల్‌ స్థానిక సెయింట్ థామస్‌ కాలేజీలో చదువుతోంది. అక్కడ తనతో పాటే చదువుతున్న అభిషేక్‌తో పరిచయం ప్రేమకు దారితీసింది. అయితే ఇటీవల వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇదే విషయమై శుక్రవారం తరగతిలోనే వీరిద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలో నిధినాపై ఆగ్రహానికి లోనైన అభిషేక్‌.. అక్కడే ఉన్న పేపర్లు కట్‌ చేసే కత్తి తీసుకుని ఆమె గొంతు కోశాడు. దీంతో నిధినా అక్కడికక్కడే మృతిచెందింది. 

ఈ ఘటనతో విద్యార్థులంతా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే నిధినాను చంపేసిన తర్వాత అభిషేక్‌ ఏ మాత్రం భయపడలేదని, ఎక్కడికి పారిపోకుండా పోలీసులు వచ్చేంతవరకూ బెంచీ మీదే కూర్చున్నాడని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని